హైదరాబాద్, మార్చి 20: గోల్డ్ నగలు కొనేందుకు బంగారం షాపుకు వచ్చిన ఓ ప్రబుద్ధుడు చాకచక్యంగా ఉంగరాలు కొట్టేశాడు. ఇలా పలు జ్యువెల్లరీ షాపులకు నగలు కొనేందుకు వచ్చినట్లు నటించి, నింపాదిగా ఒక్కక్క ఆభరణం తీసి చూసేవాడు. ఇంతలో సేల్స్ గర్ల్ కళ్లుగప్పి చొక్కా జేబులో ఉంగరాలు దాచేశాడు. ఆనక ఏం తెలియనట్లు ఉడాయించేవాడు. ఇలా నగరంలో పలు బంగారం షాపుల్లో చోరీలు చేశాడు. అనుకోని విధంగా ఈ వ్యవహారం బయపటడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో అసలు కథ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం..
ఎం సాగర్ (30) అనే వ్యక్తి బంగారం కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్‌గా నటిస్తూ హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో ఉన్న బంగారు నగర షాపులో ప్రవేశించాడు. దీంతో షాపు సిబ్బంది సెలక్షన్ కోసం అతడి ముందు కొన్ని ఆభరణాలు ఉంచారు. ఇంతలో సిబ్బంది ఇతర కస్టమర్లకు సేవలు అందించేందుకు పక్కకు వెళ్లారు. అదే అదనుగా అతగాడు గోల్డ్ ఉంగరాలను దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ వాటిని పెట్టాడు. ఇలా ఒక్క షాపులో మాత్రమే కాదు జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య సిటీలోని CMR జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ బంగారు దుకాణాలను సందర్శించారు. ఇలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని బంగారు ఆభరణాలు మాయం చేశాడో తెలియదుగానీ.. ఇతగాడి చేతి వాటం ఓ షాపు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..12 రాశులకు వారఫలాలు
- Golconda: గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..
- Medchal: కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని..
- నేటి జాతకములు 21 జూన్, 2026
- Lotus Flower: దేవతల ఆసనంగా తామర పువ్వే ఎందుకు? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకర రహస్యం





