అమరావతి:
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలను పశ్చిమ శాసన సభ్యురాలు గల్లా మాధవి ప్రకటించారు. వీటిలో ఒకటైన క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా 49వ డివిజన్ కు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ ఉదయభాను (చింటు) ను నియమించటం జరిగింది. ఈ ప్రాంతం గతంలో గుంటూరు ఒకటో నియోజకవర్గం పరిధిలోకి ఉండేటిది. అప్పట్లో ఉదయభాను నగర,నియోజకవర తెలుగు విద్యార్థి విభాగం మరియు తెలుగు యువతలో కార్యదర్శిగా ఉపాధ్యక్షుడుగా పనిచేయడం జరిగిందనీ, మంచి వ్యక్తికి ఉపవాస దీక్షలలో పదవి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన క్రిస్టియన్ సెల్ లో ఉదయభానుని నియమించడం పట్ల నియోజకవర్గంలోని చర్చి పాస్టర్లు, చర్చి ఫాదర్లు మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత క్రిస్టియన్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు కర్ర హోనక్ బెంజిమెన్ హర్షం వ్యక్తం చేశారు. ఫాదర్లు, పాస్టర్లతో సన్నిహిత సంబంధాలతో వారికి చేదోడు వాదోడుగా ఉంటాడని, పేద క్రిస్టియన్ వర్గాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేయాలని టిడిపి సీనియర్ రాష్ట్ర నాయకుడు సిరిపురపు శ్రీధర్ మరియు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జోసఫ్ ఆశాభావంతో వ్యక్తం చేశారు. ఈ పదవి నియామాకానికి సహకరించిన శాసనసభ్యురాలు గల్లా మాధవికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also read
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!
- హాట్సాఫ్ పోలీస్..! ప్రాణాలను పణంగా పెట్టి మహిళను కాపాడిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్!
- కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థిని సూసైడ్ నోట్.. అసలేం జరిగిందంటే..?
- కీచకుడిపై చట్టపరమైన చర్యలు
- దస్తొవేజు లేఖరుల పొట్టకొట్టొద్దు…. గ్రీష్మ కుమార్, సి.పి.ఐ.(యం.యల్.)





