రాజంపేట: లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయాలతో బయటపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని ఆర్‌ఎస్‌రోడ్‌లో ఉన్న దీప్లడ్జిలోని రిసెప్షన్ కౌంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన పొగతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు లాడ్జిపైకి చేరుకున్నారు.
జనసంచారం తక్కువగా ఉండే సమయంలో లాడ్జిపై నుంచి కేకలు వినిపించడం, దట్టమైన పొగ రావడంతో కొందరు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల గుండా కిందకు దించి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్(32) సజీవ దహనమయ్యాడు.
ఇతడు కే-సూపర్ మార్కెట్లో ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను సబ్‌కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజామ్నాథ్ర్డే పరామర్శించారు. ఘటనాస్థలాన్ని రాజంపేట అర్బన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించడంలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఘటనాస్థలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.
Also read
- బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
- ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
- వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు.. మీ పూర్వీకుల ఆశీస్సులు లభించి సక్సెస్ మీ సొంతం!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





