హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడు.. విశాఖ భీమిలిలో సూసైడ్ చేసుకున్నాడు. ప్రేయసి ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకే తను ఉరివేసుకుని చనిపోవడం కలకలం రేపింది.. ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీయడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ కుమార్, పావని ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. పావని ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్యామ్ కుమార్ భయపడిపోయాడు. పావని సూసైడ్‌నోట్ ఆధారంగా హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్‌లో శ్యామ్‌పై కేసు నమోదయింది. దీంతో శ్యామ్.. విశాఖపట్నం పారిపోయి వచ్చాడు. భీమిలిలోని ఓ లాడ్జిలో రూము తీసుకుని.. అక్కడే ఉన్నాడు. అయితే.. పావని మృతి చెందిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న శ్యామ్ కుమార్.. శుక్రవారం మద్యంలో విషం కలుపుకుని తాగి.. ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్యామ్ రూము తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం స్పేర్ కీతో తలుపులు తీసి చూశారు. అప్పటికే.. శ్యామ్ కుమార్ విగతజీవిగా కనిపించాడు. హైదరాబాద్‌లో ప్రేయసి పావని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.. అంతలోనే శ్యామ్ కుమార్ సూసైడ్ చేసుకోవడం విషాదం నింపింది.. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పావని సూసైడ్ నోట్ ఆధారంగా కేసు..
పావని సూసైడ్ నోట్ ఆధారంగా హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్‌లో శ్యామ్‌పై కేసు నమోదయింది. కేసు నమోదుతో మనస్తాపానికి గురై.. విశాఖకు పారిపోయి లాడ్జీలో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి, ఆనందపురంలో శ్యామ్‌పై కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు.. శ్యామ్ ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూమ్ లో ఎలుకల మందు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. సారీ అమ్మ అంటూ.. శ్యామ్ దానిలో రాశాడు.
Also read
- ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం..
- అవిముక్తేశ్వరానందపై లైంగిక వేధింపుల కేసు.. పోక్సో కోర్టు ఆదేశాలతో FIR నమోదు!
- Andhra Pradesh: బ్రేకప్ తర్వాత కలుసుకున్న ప్రేమికులు.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ.. చివరకు..
- Lord Shani: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!
- శివుడిని సోమవారం మాత్రమే ఎందుకు పూజిస్తారో తెలుసా?





