సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్లో జరిగింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది.
ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్మానించారు. దీని తర్వాత స్పందన మహేష్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఆగ్రహించిన మహేష్, స్పందన తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని, ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి ఆమె తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు.
Also read
- మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం- ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసా?
- Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు
- శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు.. భక్తికి ఉన్న శక్తి ఇదే!
- పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నేటి పేర్లు ఇవే!
- Mala Japa Rules: జపమాలతో మంత్రం జపిస్తున్నారా?.. ఈ చూపుడు వేలు నియమం మీకు తెలుసా?





