మొబైల్ రీఛార్జ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రీజార్జ్ కోసం.. తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన తల్లిదండ్రులను శోకసముద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని తండ్రిని అడిగాడు. రైతు కూలీ అయిన తండ్రి రామకృష్ణ.. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేవని.. ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పాడు.. దీంతో కొడుకు నవీన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
మొబైల్ రీఛార్జ్ చేసుకునేందుకు డబ్బులు అడిగితే.. తన తండ్రి ఇవ్వలేదని తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు.. క్షణికావేశంలో నవీన్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నవీన్ ను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే అతన్ని బళ్ళారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నవీన్ పరిస్థితి విషమించింది.. చికిత్స పొందుతూ నవీన్.. ఆసుపత్రిలో చనిపోయాడు.
దీంతో ఒక్కగానొక్క కొడుకు మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముగ్గురు కూతుళ్లను చదివిస్తూ.. చాలీచాలని ఆదాయంతో.. కౌలు రైతుగా పనిచేస్తున్న రామకృష్ణ ఒక్కగానొక్క కొడుకు నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా యువకుడు నవీన్ తొందరపడి తీసుకున్న నిర్ణయం.. తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది.
ఏదీఏమైనా ఆత్మహత్య అనేది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం.. ఇలాంటి ఆలోచనలు అస్సలు మంచిది కాదు.. మనోవేదనకు లోనైతే.. తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సింది పోయి.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




