ఖమ్మం : ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం… మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లికి చెందిన ఓ విద్యార్థి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. వసతిగృహంలోనే ఉంటున్న ఆ విద్యార్థిని ఈ నెల 12న రాత్రి సమయంలో వార్డెన్లు రాకేశ్, కిరణ్, శివలు వేరే గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారు. చేతులు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో అతని వీపంతా వాతలు తేలాయి. విషయం ఎవరికీ చెప్పకుండా కట్టడి చేయడంతో బాలుడు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేకపోయాడు. బాధితుడి స్నేహితుడి ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు.. శనివారం పాఠశాలకు వచ్చి వార్డెన్లు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు.. శనివారం పాఠశాలకు వచ్చి వార్డెన్లు, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు వార్డెన్లు రాకేశ్, కిరణ్, శివలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





