SGSTV NEWS online
CrimeNational

జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొట్టి కారు పల్టీలు



ఏడుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు శివారులో ఘటన

బెంగళూరు (గ్రామీణం), చింతామణి, : ఆరుగురు ఇంటర్ విద్యార్థుల అత్యుత్సాహం వారితోపాటు మరొకరిని బలిగొంది. తల్లిదండ్రులకు తెలియకుండా రాత్రివేళ సరదాగా జాతీయ రహదారిపై డ్రైవ్కు వెళ్లిన వారు అతివేగంతో వాహనం నడుపుతూ మృత్యువాతపడ్డారు. ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని దుఃణణాన్ని మిగిల్చారు. కర్ణాటకలోని సూలిబెలె గ్రామీణ ఠాణా పోలీసుల వివరాల ప్రకారం.. యలహంకలోని ఆర్బీపీయూ కళాశాల విద్యార్థి ఆశ్విన్ నాయర్ గురువారం రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా కారును బయటికి తీసుకొచ్చాడు. తన స్నేహితులు ఆర్దాన్ షరీఫ్, ఆయాస్ అలీ, భరత్, ఎడాస్ జార్జ్, అజిత్ బాబీలను ఎక్కించుకుని ఇటీవల ప్రారంభించిన బెంగళూరు – చెన్నై ఎక్స్ప్రెస్ రహదారిపై వెళ్తూ హొసకోటెకి చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ దేవనహళ్లి వైపు వస్తుండగా ఎం. సత్యవర గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ వేగానికి కారు. డివైడర్ దాటి పల్టీలు కొట్టి అటువైపు వెళ్తున్న లారీని, మరో కారును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు (వీరంతా 16, 17 సంవత్సరాల వారే), బైకైఫై వెళ్తున్న గగన్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్బ్యాగ్లు తెరుచుకుని పగిలిపోగా, లారీ నుంచి రెండు చక్రాలు విడిపోయాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు వైద్యసిబ్బంది. తీవ్రంగా శ్రమించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts