*వడ్లమూడి విజ్ఞాన్ కళాశాల విద్యార్థిపై దాడి!?*
– విద్యార్ధిని తోటలోకి తీసుకెళ్లి దాడి చేసిన మూక
బాపట్ల/గుంటూరు/చేబ్రోలు:* వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులే మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి, కళాశాల సమీపంలో ఉన్న ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ గుంపుగా చేరిన విద్యార్థులు బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో, చేతులతో చితకబాదినట్లు సమాచారం. నన్ను వదిలేయండి అంటూ సదరు బాధితుడు చేతులు జోడించి దండం పెడుతున్నప్పటికీ విద్యార్థుల గుంపు అతనిని వదిలిపెట్టలేదు.
ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. విద్యాసంస్థల యాజమాన్యం దీనిపై ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు. స్థానిక పోలీసులు కూడా ఇంతవరకు ఈ ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులు ఎవరు? …
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





