పశ్చిమగోదావరి: అత్యవసర స్థితిలో ఉన్న వా రిని ఆస్పత్రికి. చేర్చి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ మృత్యు శకటంగా మారింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైక్, ఆటోను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మండలంలోని సీతారామపురం టోల్జా సమీపంలో మొగల్తూరు వైపు నుంచి నరసాపురం వస్తున్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ ముందు వెళుతున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అలాగే అదుపు తప్పి పక్కన వెళుతున్న ఆటోను ఢీకొట్టింది.
మొగల్తూరు బండి ముత్యాలమ్మ ఆల యానికి వెళ్లి తిరిగి స్వగ్రామం యలమంచిలిలంకలోని వైవిలంకకు బైక్‌పై వెళుతున్న పిప్పళ్ల శ్రీవెంకట మోహన కృష్ణ, అతడి తల్లి, చినమ్మ సత్యలక్ష్మీ పద్మశ్రీ (40)కి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలోని డ్రైవర్‌తో పాటు ఇద్దరికీ గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన పద్మశ్రీని పాలకొల్లు తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
Also Read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





