SGSTV NEWS online
Andhra PradeshCrimeSpiritual

MLA Sridhar: ఎం ఎల్ ఏ  వివాదం.. ఎన్ ఎచ్ ఆర్ సి ఆశ్రయించిన హర్ష వీణ



రైల్వే కోడూరు శాసనసభ్యుడు ఆరవ శ్రీధర్ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు హర్ష వీణ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.

గత కొంతకాలంగా తనపై జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న హర్ష వీణ, తాజాగా ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు సమర్పించారు. ఈ నెల 26న ఆమె ఫిర్యాదు చేయగా, కమిషన్ దానిని పరిశీలించి 29వ తేదీన అధికారికంగా రిజిస్టర్ చేసింది. ఈ ఫిర్యాదుకు 186/1/13/2026 అనే కేసు నంబర్ను కేటాయించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

అడ్వకేట్ సాయి కృష్ణ ద్వారా హర్ష వీణ ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక యంత్రాంగం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతోనే తాము జాతీయ స్థాయి కమిషన్ ్ను ఆశ్రయించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ప్రమేయం ఉన్న ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

హర్ష వీణ ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది సాయి కృష్ణ మీడియాకు వెల్లడించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా భావించిన కమిషన్, తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం.

ఈ పరిణామం ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై నేరుగా జాతీయ కమిషన్లో కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని బాధితురాలు హర్ష వీణ వ్యక్తం చేశారు.

Also read

Related posts