SGSTV NEWS online
Andhra PradeshCrime

పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటే వచ్చిన భర్త.. అర్థరాత్రి భార్యను కత్తితో గొంతు కోసి పరార్..!

పాతికేళ్ల కిందట పెళ్లి.. అనుమానాలు పెనుభూతమైంది. కుటుంబ కలహాలతో రోజూ గొడవలు, పుట్టింటికి వెళ్లిన భార్య.. అయినా వదలకుండా ఆమె పాలిట కాలయముడయ్యాడు భర్త. చివరికి ఏకంగా కత్తితో దాడి చేసి హత మార్చాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని ముతరాసి కాలనీలో జరిగింది.

ముతరాసి కాలనీకి కుళ్లాయమ్మ(43)కు అనంతపుర పట్టణానికి చెందిన మారెన్నతో 26 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. లారీ డ్రైవర్‌‌గా పని చేస్తున్న మారెన్న తరుచు భార్యపై అనుమానంతో గొడవకు దిగేవాడు. ఇటీవల భార్యపై అనంతపురం త్రీటౌన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగకు కుళ్లాయమ్మ పుట్టింటికి వెళ్లింది. మారెన్న కూడా నాలుగు రోజుల కిందట అక్కడికి వచ్చి అత్తామామలతో కలిసి ఉంటున్నాడు.

కాగా, మంగళవారం (జనవరి 20) రాత్రి కుళ్లయమ్మ, మారెన్న దంపతులు ప్రత్యేక గదిలో నిద్రించారు. బుధవారం ఉదయం 3.30 నిమిషాల సమయంలో ఇద్దరూ మరోసారి గొడవకు దిగారు. భర్త కోపంతో భర్య కుళ్లయమ్మను కొడవలితో విచక్షణారహితంగా నరికి పారిపోయాడు. ఆమె అరుపులు విన్న కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కుళయమ్మ చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts