SGSTV NEWS online
Andhra PradeshCrime

Tuni: బంగారయ్య హత్యకేసులో.. 12 మంది వైసీపీ కార్యకర్తల అరెస్టు


నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లిన పోలీసులు

తుని, తుని , : కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో ఈనెల 16న జరిగిన తెదేపా కార్యకర్త లాలం బంగారయ్య హత్యకేసులో వైసీపీ కు చెందిన 12 మందిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిరాజా విశ్వనాథ్ అలియాస్ చినబాబు (ఏ1), చింతకాయల నారాయణ మహేష్(యేసుబాబు), చిటికెల నారాయణమూర్తి, పెదపాత్రుని సతీష్, గొంప వీరబాబు. అంకంరెడ్డి సాయికుమార్, చింతకాయల సత్యనారాయణమూర్తి, రుత్తల సాయి భానుప్రకాష్, కాళ్ల రమేష్, రుత్తల కిషోర్, రుత్తల సాయికిరణ్, అంకంరెడ్డి నారాయణమూర్తిలను పోలీసులు బుధవారం తుని రూరల్ సర్కిల్ కార్యాలయం నుంచి న్యాయస్థానానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు జి.చెన్నకేశవరావు, ఎం.గీతారామకృష్ణ, ఎస్సైలు రామకృష్ణ, కృష్ణమాచార్యులు, ప్రత్యేక బలగాలనడుమ నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్  విధించడంతో వారిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. మినీ బస్సు మొరాయించిందని, మిగిలిన వాహనాలు సరిపోలేదని అందుకే నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకువెళ్లినట్లు డీఎస్పీ చెప్పారు.

రాజకీయ కక్షలతో: రాజకీయ కక్షలతో వైసీపీ, టీడీపీ

వర్గాల మధ్య శత్రుత్వం పెరిగిందని డీఎస్పీ శ్రీహరిరాజ తెలిపారు. ఈనెల 16న అల్లిపూడి తెదేపా నాయకుడు అంకంరెడ్డి ఎర్రపాత్రుడు(బుల్లిబాబు) జన్మదిన వేడుకల అనంతరం ఆ పార్టీకి చెందినవారు రామాలయం వద్దకు వెళుతుండగా రాత్రి 8.30 గంటలకు దాడి జరిగిందన్నారు. చినబాబు, మరో 11 మంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. టీడీపీ కార్యకర్త బంగారయ్య(38) తీవ్ర గాయాలతో తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, శ్రీరామ్మూర్తి, దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారనివివరించారు. దాడికి ముందు నిందితులంతా సమావేశమై టీడీపీ కార్యకర్తలను హతమార్చేందుకు కుట్రపన్నినట్లు సాక్షులు వెల్లడించారన్నారు. హత్యోదంతానికి కొన్ని రోజుల ముందు రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో జరిగిన చిన్న వివాదం గొడవకు ఆజ్యం పోసిందని చెప్పారు.

Also read

Related posts