Weekly Horoscope: ఈ వార ఫలాలు 18.1.2026 నుంచి 24.1.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి ఫలాలు
అవసరానికి స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు మరింత పుంజుకుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సంతానం విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
అన్ని వ్యవహారాల్లోనూ విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా స్థిరాస్తి లాభం కలుగుతుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాముల సహాయ సహకారాలతో మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు నూతన పదవులు పొందుతారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో విబేధాలు తొలగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పిల్లల చదువు విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగులకు ఆశించిన ట్రాన్స్ ఫర్లు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహ రాశి ఫలాలు
ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.
కన్య రాశి ఫలాలు
వివాదాలకు సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బందు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి
తుల రాశి ఫలాలు
కొన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగులు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
చాలా కాలంగా పూర్తి కాని పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అంచనాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది
ధనుస్సు రాశి ఫలాలు
దీర్ఘకాలిక సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన పనులలో అవరోధాలు చికాకు కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
కుంభ రాశి ఫలాలు
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
మీన రాశి ఫలాలు
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. బంధు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఇతరుల సమస్యలను తెలివితేటలతో పరిష్కరిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే










