SGSTV NEWS online
CrimeTelangana

Adilabad: మహిళను హత్య చేసి.. మహారాష్ట్రలో పూడ్చిపెట్టి..ఆలస్యంగా వెలుగులోకి ఘటన



ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన ఓ మహిళ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు నెలన్నర కిందట పిట్టలవాడలోని ఆమె ఇంట్లోనే హత్య చేసి మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సార్ట్లని సమీపంలోని అడవిలోని వంతెన కింద పూడ్చిపెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పిట్టలవాడలో ఒంటరిగా నివసిస్తున్న ఇమ్రానా జబీన్ (38).. తనకు పరిచయం ఉన్న ఇంద్రవెల్లికి చెందిన ఫారూఖాఖాన్కు తన వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి మరీ కొంత సొమ్ము అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఫారూఖ్ప ఆమె ఒత్తిడి తీసుకురాగా.. అతడు ఇవ్వలేదు. గత ఏడాది నవంబరు 25 నుంచి జబీన్ కనిపించకపోవడంతో.. ఆమె సోదరి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు కేసు నమోదు చేశారు.

తమ మేనమామ కుమారుడు మహ్మద్ తాహెర్.. జబీన్ ను వ్యక్తిగత ఫొటోలున్నాయంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు ఆమెసోదరి ఈ నెల 11న మరో ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫారూఖా ఖాన్ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. మహిళను పిట్టలవాడలో హత్య చేసి మహారాష్ట్ర కిన్వట్ సమీపంలోని అటవీ ప్రాంతానికి కారులో తరలించి పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. మావల ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్సై మధుకృష్ణ, తలమడుగు తహసీల్దార్ రాజ్మాహన్ సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో శవాన్ని వెలికితీశారు. ఈ విషయమై డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ని వివరణ కోరగా… హత్య ఘటనను నిర్ధారించారు. ఇంకా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Also read

Related posts