సుల్తానాబాద్ : ఆస్తి కోసం పెంచి పోషించిన తల్లిని ఓ కుమారుడు హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కోమడ్లపల్లికి చెందిన ఐలవేని భాగ్యమ్మ(65), రాజయ్యకు సంతానం లేదు. దీంతో భాగ్యమ్మ తన మరిది నర్సయ్య కుమారుడు ఐలవేని సాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. అతడికి వివాహం అవగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడి భార్య నిండు గర్భిణికాగా ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 4 నెలల కిందట రాజయ్య మరణించగా అప్పటి నుంచి సాయి మద్యానికి బానిసయ్యాడు.
భాగ్యమ్మ మందలించగా ఆమెను హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు. తద్వారా ఆస్తి కూడా దక్కుతుందని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భాగ్యమ్మకు మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశాడు. అనుమానం వచ్చిన భాగ్యమ్మ బంధువులు సాయిని నిలదీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భాగ్యమ్మ సోదరుడు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా సీఐ సుబ్బారెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Also Read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





