మారేడుపల్లి: లెక్చరర్స్ తిట్టారని తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లిలో చోటుచేసుకుంది. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని (17) ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా రావడంతో ఫిజిక్స్, ఇంగ్లీష్ లెక్చరర్స్ శ్రీలక్ష్మి, మాధురిలు అమ్మాయిని అందరి ముందు అసభ్యకర పదజాలంతో దూషించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.
ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే మల్కాజిగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయలేదు. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం రాత్రి బాలిక మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్‌పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





