ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అర్థరాత్రి కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్నం అంతా 2026కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే పోలీసుల వైఖరితో న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇటు జగ్గయ్యపేట పరిధిలో కేక్ కట్టింగ్ యువకుల మధ్య చిచ్చును రాజేసింది.
జగ్గయ్యపేట పట్టణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక.. తొర్రగుంటపాలెం రోడ్డుపై కొందరు యువకులు కేక్ కటింగు ప్రయత్నించారు. అదే సమయంలో.. అటువైపుగా కారులో నలుగురు యువకులు వచ్చారు. నడిరోడ్డుపై సెలబ్రేషన్స్ ఏంటని?.. పక్క నిర్వహించుకోవాలని.. తమకు దారి ఇవ్వాలంటూ వాళ్లను కోరారు. అయితే..
కేక్ కట్టింగ్ అయ్యాకే కారు ముందుకు వెళ్తుందంటూ తేల్చి చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో యువకులు ఒకరినొకరు తోసేసుకుని పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ దాడిలో కారులో వచ్చిన యువకులకు గాయాలు కావడంతో.. స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నారా?. ఫిర్యాదు నమోదు అయ్యిందా?.. అనే విషయాలు తెలియాలంటే ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సిందే.
Also Read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





