New Year 2026 Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కుజులు అనుకూల స్థానాల్లో ఉన్నా, బాగా బలంగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. కొత్త సంవత్సరంలో ఈ రెండు రాజయోగ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం. ఈ రవి, కుజుల బలాన్ని బట్టి ఈ రాశుల వారికి ప్రభుత్వంలో, బ్యాంకుల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో చిన్న ఉద్యోగం మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాల వరకు లభించే అవకాశం ఉంది. ఈ రాశులవారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది.
👉 మేషం:
రాశ్యధిపతి కుజుడు కొత్త సంవత్సరమంతా పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. బుధుడు మార్చి నుంచి, గురువు జూన్ నుంచి అనుకూలంగా మారుతున్నందువల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది. వీరికి సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది.
👉 కర్కాటకం:
ఈ రాశికి జనవరి 15 నుంచి కుజ, రవులు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఎటువంటి పోటీ పరీక్షలు, రాత పరీక్షల్లోనైనా వీరు నెగ్గే అవకాశం ఉంది. జూన్ నుంచి గురువు ఇదే రాశిలో ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బాగా దూర ప్రాంతంలో వీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
👉 సింహం:
రాశ్యధిపతి రవితో పాటు కుజుడు కూడా జనవరి నుంచి అనుకూలంగా మారడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో గానీ, బ్యాంకుల్లో గానీ ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో జూన్ లోపు వీరి కల సాకారం అవుతుంది. సొంత ఊర్లో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గురువు అనుకూలత వల్ల వీరికి కోరిక నెరవేరుతుంది.
👉వృశ్చికం:
రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాలలో సంచారం చేయడం, రవి కూడా అనుకూల స్థానాల్లో ప్రవేశించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రాశివారికి బాగా అవకాశం ఉంది. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో మే లోపు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది. జూన్ నుంచి గురువు కూడా ఉచ్ఛపడుతున్నందువల్ల వీరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు సంబంధించిన రాత పరీక్షలు, ఇంటర్వ్యూలకు తయారు కావడం మంచిది. తప్పకుండా వీరి కల, కోరిక నెరవేరుతాయి.
👉 ధనుస్సు:
ఈ రాశివారికి రవి, కుజులే కాక, గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త సంవత్సరంలో ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగాలకు కూడా బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడానికి గురువు తోడ్పడడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు జూన్ లోపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. వీరికి ఉన్నత పదవులకు కూడా బాగా అవకాశం ఉంది.
👉 కుంభం:
ప్రభుత్వ ఉద్యోగాలకే కాక, అధికారానికి కూడా కారకులైన కుజ, రవి గ్రహాలు ఫిబ్రవరి నుంచి ఈ రాశి మీద నుంచి సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. గురు బలం కూడా తోడవుతున్నందువల్ల వీరికి ఉన్నత పదవులు, భారీ జీత భత్యాలు లభించే అవకాశం కూడా ఉంది. సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!










