చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.
గిరాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రిరాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.
ఆరోగ్యంగా ఉన్న గిరాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
Also Read
- ప్రియుడి బెయిల్ డబ్బుల కోసం డ్రగ్స్ కొరియర్గా మారిన ప్రియురాలు.. కట్ చేస్తే భారీ నెట్వర్క్ బట్టబయలు!
- లాడ్జిలో దారుణం.. బీర్ బాటిల్తో భార్యను చంపిన భర్త!
- అశోక్ నగర్ లో దారుణ హత్య
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్



