ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్… అదే అంబులెన్స్‌ను మద్యం మత్తులో నడిపిన డ్రైవర్! వరంగల్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 226 డ్రంక్ రీడింగ్‌తో అడ్డంగా బుక్కైన అంబులెన్స్ డ్రైవర్ ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి …
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చాల్సిన బాధ్యత అంబులెన్స్‌దే. అలాంటి అంబులెన్స్‌ను నడిపే డ్రైవర్‌నే మద్యం మత్తులో వాహనం నడిపితే ఇక బాధితుల ప్రాణాలకు భరోసా ఎక్కడ ఉంటుంది? అసలు సమస్య పక్కనపెడితే… ప్రమాదం జరిగి ప్రాణాలు ముందే పోయే పరిస్థితి నెలకొంటుంది. వరంగల్‌లో ఇలాంటి ఆందోళనకర ఘటన వెలుగుచూసింది.
ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం మత్తులో అంబులెన్స్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అంబులెన్స్‌ను సీజ్ చేశారు. వరంగల్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో వరంగల్–నర్సంపేట రోడ్డుపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లోహిత అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపారు. TS 05 UA 6305 నంబర్ గల అంబులెన్స్ డ్రైవర్‌ను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, ఏకంగా 226 రీడింగ్ నమోదు కావడం గమనార్హం. ఇది చూసి పోలీసులే అవాక్కయ్యారు. డ్రైవర్ భాస్కర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అంబులెన్స్‌ను సీజ్ చేశారు
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



