పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు టీచర్లు కూడా సిలబస్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట విద్యార్ధులందరూ క్లాస్‌లో కూర్చుని టీచర్ పాఠాలు వింటుండగా.. ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ తప్పి..
రామచంద్రపురం, డిసెంబర్ 13: పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు టీచర్లు కూడా సిలబస్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట విద్యార్ధులందరూ క్లాస్‌లో కూర్చుని టీచర్ పాఠాలు వింటుండగా.. ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం (డిసెంబర్ 13) ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (14) స్థానికంగా ఉన్న రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఉదయం పూట స్కూల్లో పాఠాలు వింటుండగానే ఉన్నట్లుండి సృహ తప్పి పడిపోయింది. దీంతో స్కూల్ యాజమన్యం హుటా హుటిన బాలికను ఏరియా ఆసుపత్రి కి తరలించారు.అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. స్ట్రోక్ రావడంతో చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



