ప్రకాశం జిల్లా లో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు ఆపారు.. తర్వాత పరిశీలించి చూస్తే పోలీసులు నిర్ఝాంతపోయారు.. కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది. వివరాల ప్రకారం.. కారుకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్టిక్కర్ను తగిలించుకుని టోల్‌గేట్‌ల వద్ద సిబ్బంది ని బురిడీ కొట్టిస్తూ… టోల్ చలనాలు చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న మున్వర్ అనే వ్యక్తి ని యర్రగొండపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వద్ద కారు డ్రైవర్ గా ఉన్నాడు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ పై పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ చేయించి అంటించాడు.
అదేవిధంగా తన ఇతియాస్ కారు నెంబర్ ప్లేట్ లోని D అనే అక్షరం కనపడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించి జాతీయ రహదారి పై ఉండే టోల్ గేట్స్ తోపాటు ఫారెస్ట్ టోల్ గేట్స్ వద్ద చలనాలు చెల్లించకుండా కారును అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి పై ఉన్న మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా మున్వర్ తన కారుతో అక్కడకు వచ్చాడు. నెంబర్ ప్లేట్ పై అనుమానం కలిగిన ఎస్సై చౌడయ్య ఆరా తీస్తుండగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును ఆపుతారా అంటూ మున్వర్ నిర్లక్ష్యం గా వ్యవహరించాడు.
దీంతో కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా నకిలీది కావడంతో మున్వర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది పోలీస్, ప్రెస్, ఎమ్మెల్యే, వివిధ గవర్నమెంట్ లోగోలతో వారికి సంబంధం లేక పోయినా వాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.. ఇలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
Also read
- 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయటకొచ్చిన ర్యాగింగ్ భూతం.. జూనియర్స్ బట్టలు విప్పించి మరీ
- సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్‌చేస్తే యువతి..
- జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన యువతుల మృతి
- ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
- అమానుషం.. అంగన్వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?





