Karimnagar News: అనారోగ్యమా? తల్లి చనిపోయిందని తట్టుకోలేక పోయిందా? ఇలా కారణాలు ఏమైనా కావచ్చు. స్మశానంలో ఓ దృశ్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లి సమాధి నుంచి మూడురోజులుగా ఆ యువతిని కదిలించే ప్రయత్నం చేయకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి 3..
కరీంనగర్లో స్మశానంలో ఓ దృశ్యం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కబరస్తాన్ స్మశానం ఇందుకు వేదికైంది. గడిచిన మూడు రోజులుగా ఓ యువతి తన తల్లి సమాధి నుంచి ఏ మాత్రం కదలేదు. పగలూ, రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంది ఆ యువతి. చివరకు కుటుంబ సభ్యులు సైతం యువతిని కదిలించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ ఘటన వెనుక తీవ్ర విషాదం లేకపోలేదు. యువతి తల్లి ఈ మధ్య మరణించింది. ఆ మరణాన్ని తట్టుకోలేకపోయింది. చివరకు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దీన్ని తట్టుకోలేని ఆ యువతి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. వెతికిన కుటుంబ సభ్యులకు స్మశానం వద్ద ఈ విధంగా కనిపించింది.
తల్లి సమాధి వద్ద యువతి నిద్ర
తల్లి సమాధిని ఆనుకుని పడుకునివుంది. ఒకవేళ ఎవరైనా కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మై గుర్రుగా చూస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. డిప్రెషన్లో ఉందా? లేకుంటే మతి భ్రమించిందా? అంటూ చర్చించుకుంటున్నారు. యువతిని అక్కడి నుంచి తరలిస్తే ఏంటనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.
షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని కోరుతున్నారు మానవతావాదులు.
Also Read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



