ధర్మమూర్తిగా కొలిచే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో శేష వస్త్రాలపై రగడ నెలకొంది. ఆలయంలోని శేష వస్త్రాల కౌంటర్‌లో భక్తులకు విక్రయించేందుకు నకిలీ వస్త్రాలను పెడుతుండగా SPF సిబ్బంది గుర్తించారు. శేష వస్త్రాల కౌంటర్ నందు బార్ కోడ్ లేని నకిలీ వస్త్రాలైన చీరలు, పంచలు కండువాలను స్వాధీనం చేసుకుని ఈవో కార్యాలయానికి తరలించారు.
భద్రాచలం రామాలయంలో శేష వస్త్రాలపై రగడ నెలకొంది.. గత కొన్ని రోజులుగా ఆలయంలోని కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. కాసులకు కక్కుర్తి పడి కొందరు దేవుడి పేరిట భక్తులు మనోభావాలతో ఆటలాడుతున్నారు. చక్కర పొంగలి స్కాం జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే నకిలీ వస్త్రాలను శేష వస్త్రాల కౌంటర్లో విక్రయానికి పెట్టడాన్ని SPF సిబ్బంది గుర్తించారు. శేష వస్త్రాల కౌంటర్ నందు బార్ కోడ్ లేని నకిలీ వస్త్రాలైన చీరలు, పంచలు కండువాలను స్వాధీనం చేసుకుని ఈవో కార్యాలయానికి తరలించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణులకు భక్తులు భక్తితో సమర్పించిన వస్త్రాల రేటును చూపుతూ అక్రమాలు జరగకుండా ఆలయ సిబ్బంది వాటికి బార్ కోడ్ స్కానర్ ఫిక్స్ చేశారు. సాధారణంగా భక్తులు ఎంతో భక్తితో మొక్కులు చెల్లించుకుని సమర్పించిన వస్త్రాలకు బార్ కోడ్ కేటాయించి కౌంటర్ కు తరలిస్తారు. ఈ కౌంటర్ లో కాంట్రాక్టర్ వస్త్రాలు విక్రయించాలంటే ఆలయం లేబుల్ తప్పనిసరిగా ఉండాలి.. అపుడే భక్తులకు విక్రయించాలి.
అయితే ఈ మధ్య కొందరు వ్యక్తులు ప్రైవేట్ దుకాణాలు నుంచి భక్తి ముసుగులో బయటి నుండి నకిలీ వస్త్రాలను తెచ్చి శేష వస్త్రాల కౌంటర్ నందు విక్రయిస్తున్నట్టు ఎస్‌పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ అవినీతికి చెక్ పెట్టి.. శేష వస్త్రాల కౌంటర్ నందు బార్ కోడ్ లేని నకిలీ వస్త్రాలైన చీరలు, పంచలు కండువాలను స్వాధీనం చేసుకుని ఈవో కార్యాలయానికి తరలించారు.
ధర్మమూర్తిగా కొలిచే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో నకిలీ వస్త్రాల అమ్మకాలపై ఆలయ ఈవో దామోదర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు. మొన్న ప్రసాదం, ఇప్పుడు నకిలీ శేష వస్త్రాల విక్రయం ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





