విధి ఆడిన వింత నాటకం ఓ నిండు గర్భిణీ స్త్రీ ప్రాణాలు బలి తీసుకుంది.. పుట్టినరోజు నాడే ఆ గర్భిణీ స్త్రీ పాడే ఎక్కింది.. విద్యుత్ షాక్ రూపంలో అభం శుభం ఎరుగని గర్భిణీ స్త్రీ.. అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా విషాద వాతావారణం అలుముకుంది.
ఈ విషాద సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. వివరాల ప్రకారం. ప్రత్యూష అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ తన ఇంటి ఆవరణలో ఆరేసిన బట్టలు తీస్తుంది.. ఈ క్రమంలో బట్టలు ఆరేసిన ఐరన్ తీగకు విద్యుత్ సరఫరా అయ్యి విద్యుత్ షాక్ కు గురైంది.
ప్రత్యూష విద్యుత్ షాక్ తో పడి పోవడంతో అక్కడున్నవారు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం కేక్ కటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో గర్భిణీ స్త్రీ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి చేరుకున్న ప్రత్యూష ప్రస్తుతం 7 నెలల గర్భిణీ స్త్రీ కాగా… మృతురాలికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు.. రెండోసారి గర్భం దాల్చిన ప్రత్యూష ఆ బిడ్డకు జన్మనివ్వకుండానే ప్రాణాలు కోల్పోయింది.. గర్భిణీ పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
- ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
- శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
- Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
- kakinada: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
- సినిమా స్టంట్‌ను తలపించిన స్కార్పియో యాక్సిడెంట్





