SGSTV NEWS online
Andhra Pradesh

Andhra: రాత్రివేళ ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడు.. ఎవరా అని చూడగా కళ్లు తేలేశారు

 

గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉండే ఈ ఆసుపత్రిలో రెండు వేల బెడ్స్ ఉంటాయి. ప్రతి రోజూ మూడు వేల మంది అవుట్ పేషెంట్స్‌ జిజిహెచ్ కు వస్తుంటారు. ముప్పైకి పైగా విభాగాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.

గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉండే ఆసుపత్రిలో రెండు వేల బెడ్స్ ఉంటాయి. ప్రతి రోజూ మూడు వేల మంది అవుట్ పేషెంట్ జిజిహెచ్ కు వస్తుంటారు. ముప్పైకి పైగా విభాగాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో రోగులకు అన్ని సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే పెద్ద ప్రయత్నమే చేయాలి. గత కొంతకాలంగా ఆసుపత్రిలో పారిశుద్య లోపం ఉందని, వైద్యులు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదని, అత్యవసర విభాగాల వద్ద ఉద్యోగుల వ్యవహార శైలి గందరగోళంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పది గంటల నుండి తెల్లవారే వరకూ అందుతున్న సేవలపై రోగుల్లో అసంత్రుప్తి నెలకొంది. ఈ క్రమంలోనే సూపరింటిండెంట్ గా యశస్వి రమణ ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి, లోపాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకున్నారు.

సాధారణ తనిఖీలు చేస్తే ఉద్యోగులు, వైద్యులు గుర్తించి ముందే అలెర్ట్ అవుతారని భావించిన సూపరింటిండెంట్ రమణ…. మారు వేషంలో వెళ్లేందుకు సిద్దమయ్యారు. రాత్రి పది గంటల సమయంలో వ్రుద్దుడి వేషంలో ఇద్దరూ సహాయకులతో ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు. అక్కడ నుండి వివిధ వార్డుల చుట్టూ తిరుగుతూ వైద్యులు, సిబ్బంది పనితీరును గమనించారు. వార్డుల్లోకి కుక్కలు వస్తుండటాన్ని ప్రత్యేకంగా చూశారు. రాత్రి సమయంలో వచ్చే రోగులతో సిబ్బంది మాట్లాడుతున్న వ్యవహారశైలిని గమనించారు. దాదాపు రెండు గంటల పాటు మారువేషంలోనే ఆసుపత్రి మొత్తం కలియదిరిగారు. అనంతరం ఆసుపత్రికి ఎలా వచ్చారో అలానే వెళ్లిపోయారు. ఆయన తనిఖీల్లో భాగంగా పలు లోపాలను గుర్తించినట్లు తెలిసింది. వాటిల్లో మార్పు తెచ్చేందుకు సూపరింటిండెంట్ ఉద్యుక్తులయ్యారు. అయితే రమణ వచ్చి వెళ్లినట్లుగా చాలామంది సిబ్బంది గుర్తించలేదు. కొందరూ దురుసుగా కూడా ప్రవర్తించినట్లు తెలిసింది. మొత్తం మీద రాత్రి సమయాల్లో ఆసుపత్రిలో పరిస్థితి తెలుసుకునేందుకు సూపరింటిండెంటే మారు వేషంలో రావడంతో ఉద్యోగులు మాత్రం బెంబెలెత్తిపోతున్నారు.

Also Read

Related posts