గౌరవప్రదమైన వృత్తిలో ఉండి పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ హోంగార్డు మతితప్పి ప్రవర్తించాడు. చిన్నారుల ముందే.. ఓ మహిళతో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తూ విర్రవీగాడు. అతని డ్యాన్కు సంబంధించిన వీడియో వైరల్ కావడతో అతని తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కనికపాడు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్కు స్కూల్ పిల్లల ముందు ఒక మహిళతో అసభ్యకరంగా నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు తాజాగా అతన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డ్ 304 B. అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలకు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గాని.. అప్రతిష్టకు గురి చేసేలా ఉండరాదని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ సిబ్బందికి సూచించారు.
Also Read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





