క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన తండ్రి సెల్ ఫోన్ కొనిస్తానని చెప్పాడు. కానీ ఒక రోజు లేట్ అయింది అది. దీంతో సదరు అమ్మాయి మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని తన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
ఇటీవల చిన్న చిన్న విషయాలకే పలువురు ప్రాణాలు వదులుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడు అని, ఎగ్జామ్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఇలా చాలా చిన్న చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన నాగరాజు గౌడ్ అనే వ్యక్తికి నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. మూడవ కూతురు మహాలక్ష్మి(18)కి చెందిన సెల్ ఫోన్‌ను తండ్రి నాగరాజు గౌడ్ తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఇదే క్రమంలో తనకు సెల్ ఫోన్ కొనివ్వాలంటూ గురువారం మహాలక్ష్మి తండ్రిని అడిగింది. అయితే గురువారం అమావాస్య కావడంతో శుక్రవారం కొనిస్తానని తండ్రి నాగరాజు కూతురుకు నచ్చజెప్పి తాను షాప్‌కు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహాలక్ష్మి మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కూతురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




