SGSTV NEWS online
CrimeTelangana

Telangana: ఇంత మదమెందుకురా.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆ తర్వాత..


సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు సాధారణంగా ప్రయాణికులను తీసుకుని వల్లంపట్ల మార్గంలో క్రమంగా ముందుకు సాగుతుంది. రహదారి స్వల్పంగా ఇరుకుగా ఉండటంతో వాహనాలు తరచూ సైడ్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో కారు డ్రైవర్ శ్రీకాంత్ బస్సు ఎదుట కారును ఆపి దిగివచ్చాడు. సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఒక్కసారిగా బస్సు లోపలికి దూసుకెళ్లి డ్రైవర్ బాలరాజును దుర్భాషలాడుతూ దాడి చేశాడు.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన, ప్రజా రవాణా సిబ్బందిపై పెరుగుతున్న దౌర్జన్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుపై కారు డ్రైవర్ శ్రీకాంత్ బహిరంగంగా దాడి చేయడం, ప్రయాణికుల ముందు అవమానించడం, భౌతికంగానే కాక మానసికంగా కూడా అతడిని మనో వేదనకు గురిచేసింది.

వీడియో చూడండి..



అసలేం జరిగిందంటే.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు సాధారణంగా ప్రయాణికులను తీసుకుని వల్లంపట్ల మార్గంలో క్రమంగా ముందుకు సాగుతుంది. రహదారి స్వల్పంగా ఇరుకుగా ఉండటంతో వాహనాలు తరచూ సైడ్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో కారు డ్రైవర్ శ్రీకాంత్ బస్సు ఎదుట కారును ఆపి దిగివచ్చాడు. సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఒక్కసారిగా బస్సు లోపలికి దూసుకెళ్లి డ్రైవర్ బాలరాజును దుర్భాషలాడుతూ దాడి చేశాడు. రహదారి ఇరుకుగా ఉంది అని బస్సు డ్రైవర్ చెప్పినా వినకుండా కోపావేశంతో విచక్షణరహితంగా కాలుతూ తన్నుతూ దాడి చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా శ్రీకాంత్ ఎవరి మాట వినకుండా స్టీరింగ్ వద్ద కూర్చున్న డ్రైవర్‌ను చితకబాదినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.



దాడితో భయాందోళనకు గురైన డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రయాణికుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి హేయనీయమని.. కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు.

ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. రోడ్లపై తమ భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వేల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్ల సేవను గౌరవించకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పుడుతాయని సామాన్య జనాలు అభిప్రాయపడుతున్నారు

Also read

Related posts