అనకాపల్లిలో తీవ్ర కలకలం రేగింది. అనుమాన్నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ నుంచి వెళ్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ వ్యక్తి, బాలిక ఉన్నారు. అనకాపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాల సమాచారంతో ఓ బాలిక, మరో వ్యక్తి అనకాపల్లి రైల్వే స్టేషన్ పాత బుకింగ్ కౌంటర్ వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి పేరు విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయ్యబ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను 2012లో భారత్‌లోకి చొరబడ్డాడు. ఉత్తర ప్రదేశ్ అలీగడ్‌లో 10 ఏళ్లపాటు నివాసమున్నాడు. ఆ తర్వాత కాకినాడకు మకాం మార్చిన తయ్యాబ్.. మూడేళ్లుగా కాకినాడలోనే నివాసం ఉంటున్నాడు.
అయితే బంగ్లాదేశీ బాలికను పెళ్లి చేస్తానని నమ్మించి బోర్డర్ దాటించాడు తయ్యబ్. ఆ తరువాత ఆమెను తీసుకోచ్చి రెండు నెలలుగా కాకినాడలోని బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న నిగా వర్గాలు ఇద్దరి కదలికలను గమనించారు. వారు కాకినాడ నుంచి అనకాపల్లి వరకు వచ్చినట్టు తెలుసుకొని అనాపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విక్రమ్ అలియాస్ తయ్యబ్ సహా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు.
తయ్యబ్ పై ఫోక్సో, ఫారినర్ యాక్ట్, పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అలాగే అతన్ని కోర్టులో హాజరుపర్చగా కోర్టు తయ్యబ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. బాలికను చిడ్రెన్స్ హోమ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో మరికొంత సమాచారం సేకరించేందుకు నిందితుడిని కస్టడీకి తీసుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు
Also Read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





