SGSTV NEWS online
CrimeTelangana

Siddipet: పొద్దుపొడవకముందే నిద్ర లేచాడు.. టీ పెడదామని గ్యాస్ స్టౌ వెలిగించగానే..



అప్పుడప్పుడే తెల్లవారుతుండగా ఆకునూరులో ఒక్కసారిగా భయంకర శబ్దం. శెట్టె భాస్కర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు వేగంగా చెలరేగి భాస్కర్, ఆయన తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, పిల్లలు ప్రణవి, కృతిక, హర్షిణిలకు గాయాలు అయ్యాయి.

అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఆ కుటుంబంలోని ఇంకొంత మంది ఇంకా గాఢనిద్రలోనే ఉన్నారు. ఇంతలోనే భారీ శబ్ధం. హఠాత్తుగా నిద్రలోంచి లేచి చూసేసరికి ఇల్లు మొత్తం మంటలు.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, ఆకునూరులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శెట్టి భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచి రోజూ వారీలా గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో మంటలు అంటుకుని పెద్ద శబ్దం సంభవించింది. మిగత వారు నిద్రలో నుంచి తేరుకునేలోపే చుట్టు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మిగతా కుటుంబ సభ్యులకు అంటుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు భాస్కర్‌తో పాటు ఇంట్లో ఆయన తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, ముగ్గురు పిల్లలు ప్రణవి, కృతిక, హర్షిణిలు ఉన్నారు. వారందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్నవారిని త్వరగా బయటకు తీసుకొని రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also Read

Related posts