జూదం, అప్పుల కారణంగా భార్య ప్రాణాల మీదకు వచ్చిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగింది. ఆ మహిళ గత ఏడాది అక్టోబర్‌లో మీరట్‌లోని ఖివాయ్ గ్రామానికి చెందిన డానిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దికాలానికే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన ఓ మహిళ తన భర్త, అతడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త జూదానికి బానిసై.. తనను తాకట్టుగా పెట్టాడని.. అతడు ఓడిపోయిన అనంతరం తనపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ గత ఏడాది అక్టోబర్‌లో మీరట్‌లోని ఖివాయ్ గ్రామానికి చెందిన డానిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం అయిన కొద్దికాలానికే.. ఆమె భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. కట్నం తీసుకురావాలని నిరంతరం ఆమెపై దాడి చేశారు. మద్యం, జూదానికి బానిసైన భర్త.. ప్రతీరోజూ ఇంటికి తాగి వచ్చి ఆమెను కొట్టేవాడు. అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి.. ఏకంగా ఆమెనే జూదంలో ఎరగా పెట్టాడు.
జూదంలో ఓడిపోయిన తర్వాత ఆమెను ఇతరులతో బెడ్ షేర్ చేసుకోవాలని బలవంతం చేసేవాడు. ఆ క్రమంలోనే ఉమేష్ గుప్తా, మోను, అన్షుల్ సహా 8 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు బాధితురాలిపై.. ఆమె మరిది, ఆమె వదిన భర్త కూడా దాడి చేసి అత్యాచారం చేశారని తెలిపింది. ఆమె మామ యామిన్ కూడా తనపై అత్యాచారం చేయడమే కాకుండా.. కట్నం తీసుకురాకపోవడంతో తమ మాట వినాలని.. తమను సంతోషపెట్టాలన్నారని బాధితురాలు వాపోయింది.
‘పెళ్లి అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని హింసించారు. నేను గర్భవతి అని చెప్పినప్పుడు.. బలవంతంగా గర్భస్రావం చేయించారు. అలాగే నా కాలు మీద యాసిడ్ పోయడమే కాకుండా.. చంపాలని నదిలోకి తోసేశారు. అయితే కొందరు స్థానికులు నన్నుp కాపాడారు. అలాగే ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు’ అని ఆమె అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




