గుంటూరు రూరల్ మండలంలో నివసించే బాలిక పదో తరగతి చదువుతోంది. గత మే నెలలో బంధవుల ఇంటిలో శుభ కార్యం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంపించారు. అక్కడ నెల్లూరుకు చెందిన బన్నీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ విద్యార్ధిని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి తరుచూ ఫోన్ చేసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ విద్యార్ధిని చదువుకుంటున్న పాఠశాల వద్దకు స్నేహితుడితో కలిసి వచ్చాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అక్టోబర్ పదో తేదిన తనతో పాటు తీసుకెళ్లాడు. ఐదు రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు. అక్టోబర్ 15వ తేదిన ఆ బాలిక మెడలో పసుపు కొమ్ముతో తయారు చేసిన తాళి కట్టాడు. దీంతో భయభ్రాంతులకు గురైన బాలిక ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది.
అయితే బన్నీ అమ్మ, అమ్మమ్మ ఆ బాలికకు నచ్చ జెప్పి పెళ్లైన వెంటనే పుట్టింటికి వెళ్లకూడదని చెప్పారు. ఆ రోజు తమ ఇంటిలోకే బాలికను ఉంచారు. రాత్రి సమయంలో బన్నీ… ఆ బాలికపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాలిక గొడవ చేస్తుండటంతో ఆమెను తీసుకొని గుంటూరు రూరల్ మండలంలోని బాలిక స్వగ్రామానికి వచ్చాడు. అయితే అప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలించడం మొదలు పెట్టారు.
ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి బన్నీని అరెస్ట్ చేశారు. అయితే అత్యాచారంపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడికి అమ్మ, అమ్మమ్మ, స్నేహితుడు సహకరించినట్లు గుర్తించారు.
బన్నీ అమ్మ, అమ్మమ్మను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. వారికి సహకరించిన మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను మోసం చేసి పెళ్లి చేసుకుంటే పోక్సో కేసులు పెడతామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీ భానోదయ చెప్పారు.
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




