నగరంలోని ఓ అద్దె భవనంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. పట్టణ కేంద్రంలోని పత్తిపాక రోడ్డులో ఉన్న ఓ అద్దె భవనంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆదివారం ఉదయానే ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న ఇద్దరు నిర్వాహకుతలతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు కప్పి వీరు ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నలుగురికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తమకు ఏపని లేక.. డబ్బు కోసమే ఈ పని చేస్తున్నట్టు పట్టుబడిన ఇద్దరు మహిళలు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- ఉపాధి కోసం దేశం దాటి వెళ్లింది.. వేధింపుల గురించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంది.. ఇంతలోనే..
- Andhra: ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా..
- ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు.. అద్దె భవనంలో గుట్టుచప్పుడు యవ్వారం.. కట్‌చేస్తే..
- మాజాలో విషం కలిపి కూతురు, కొడుకుకు ఇచ్చాడు..
- ఇంట్లో కదల్లేని స్థితిలో కనిపించిన కూతురు.. ఏమైందోనని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..





