వెల్ఫేర్ హాస్టల్‌లో సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటారు. స్టూడెంట్స్ వద్ద ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవుతారు. తాజాగా గుంటూరులోని ఓ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అధికారులు పూర్తి సమాచారాన్ని వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గుంటూరులోని ఒక సంక్షేమ హాస్టల్‌లో వారం రోజుల క్రితం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా బయటపడింది. హాస్టల్‌లో విద్యార్థినుల లగేజీలు, బ్యాగులను సాధారణ పరిశీలన కోసం చెక్ చేస్తుండగా.. ఓ విద్యార్థిని బ్యాగులో మంగళసూత్రం, మెట్టెలు, ప్రెగ్నెన్సీ కిట్ లాంటి వస్తువులు కనిపించినట్టు సమాచారం. వాటిని చూసి ఆశ్చర్యపోయిన హాస్టల్ సిబ్బంది వెంటనే వార్డెన్‌కు తెలపగా.. వార్డెన్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ వివరాలు బయటకు రాకుండా అధికారులు రహస్యంగా ఉంచారని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి.
సమాచారం మీడియా చెవికి అందడంతో బుధవారం రాత్రి ఉన్నతాధికారులు హాస్టల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ప్రతి గదిని పరిశీలించగా, హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలో ఉందని గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం.. అలాంటి సంఘటన ఏదీ చోటుచేసుకోలేదని.. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థినిల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Nail Cutting: ఏ రోజున గోర్లు కట్ చేస్తే మీ అదృష్టం దూరం అవుతుందో తెలుసా?
- Hyderabad: బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది.. కానీ లిఫ్ట్ రాలేదు.. పాపం ఆయన వచ్చిందనుకుని
- అన్న బయటకు పోగానేే.. వదినతో కులుకుతున్నాడు.. విషయం అతనికి తెలియడంతో..
- స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు – తిరగబడిన స్కూల్ టీచర్లు
- ‘యమున’ కిడ్నీ ఏమైనట్లు..?





