SGSTV NEWS online
CrimeTelangana

ఒకే ప్లేస్‌కి రెండో సారి చోరీకి వచ్చిన దొంగలు..! ఫస్ట్ టైమ్‌ సక్సెస్‌ కానీ, రెండో సారి మాత్రం..



బోయిన్‌పల్లిలో దొంగలు రెండు రోజులు రెచ్చిపోగా, స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. తొలి దొంగతనం తర్వాత అప్రమత్తమైన ప్రజలు, రెండోసారి చోరీకి యత్నించిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చితకబాది స్తంభానికి కట్టి పోలీసులకు అప్పగించగా, చోరీ సొత్తు రికవరీ చేసి కేసు నమోదు చేశారు.

బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెండు రోజుల పాటు రెచ్చిపోయారు. సికింద్రాబాద్‌లో దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు చితకబాదారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్, రామాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రోజున మొదట ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడారు. ఇంట్లో ఉన్న విలువైన ఇత్తడి సామాగ్రిని చోరీ చేశారు. అప్పటి నుండి దొంగల వార్త ఆ నోట ఈ నోటా తెలిసి అందరూ అలెర్ట్ గా ఉన్నారు. మంగళవారం రాత్రి మళ్లీ దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు ఈసారి తప్పించుకోలేకపోయారు.

ఇంతకుముందే అనుమానం వచ్చిన స్థానికులు రాత్రంతా కాపు కాసి దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్‌ చేశారు. అర్థరాత్రి సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ప్రజలు వారిపై దాడి చేసి పట్టుకున్నారు. కోపంతో ఊగిపోయిన జనాలు వారిని చితకబాదడమే కాకుండా స్తంభానికి కట్టి బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు దొంగలించిన మూడు ఇత్తడి తాంబాలాలు, సుమారు 12 కిలోల బరువు ఉన్న సామాగ్రిని ఫతేనగర్‌లోని ఓ స్క్రాప్ షాపులో విక్రయించినట్లు విచారణలో తేలింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, దొంగలను తమ అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన సామాగ్రిని రికవరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరినీ విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు

Also Read

Related posts