రాజంపేటలో ఆర్థిక, దాంపత్య సమస్యలతో సతమతమైన వేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో చేసిన తప్పులు, బాధలు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఏమీ చేయలేకపోతున్నానని, క్షమించమని వేడుకుంటూ తనువు చాలించారు.
జీవితంలో ఎన్నో తప్పులు పొరపాట్లు చేశా.. నిత్యం బాధలు, అవమానాలు అనుభవిస్తున్నా, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్న.. ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేను నాకే ఇన్ని కష్టలా, అందరికి ఇంతేనా.. నాలో నేను లేను, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, మాట తప్పుతున్నందుకు క్షమించండి. చంద్ర శేఖర్ రెడ్డి డబ్బులు ఇస్తాడు తీసుకోండి. అమ్మ నాన్న నేను మీకు ఏమి చెయ్యలేలేకపోతున్న, దయచేసి నన్ను క్షమించండి అంటు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని తనువు చాలించాడు. స్థానికంగా ఈ సెల్ఫీ చావు సంచలం రెకేత్తించింది. ఇది రాజంపేటలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు.
రాజంపేట పట్టణం నూనెవారిపల్లి రోడ్డులో నివాసముంటున్న వేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి విషం తాగి సెల్ఫీ వీడియో తీసుకుని అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న వంగలి గ్రామనికి చెందిన పుల్లారెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి(39) రాజంపేట పట్టణంలో కర్రీ పాయింట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతను గత రెండు సంవత్సరాలుగా రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లె సమీపంలో భార్య పద్మినితో కలసి నివాసముంటున్నాడు.
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య గత కొద్దిరోజుల క్రితం పులివెందులలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న హరిప్రసాద్ గత రాత్రి ఈ అవమానాలను భరించలేక చనిపోవాలని నిర్ణయించుకొని సెల్ఫీ వీడియో తీసుకుని తన అన్నకు పంపించాడు. అనంతరం ఇంట్లోనే విషం తాగి, ఉరివేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. కని పెంచిన తల్లిదండ్రులకు తాను ఏమీ చేయలేకపోతున్నానని, జీవితమంతా తప్పులు చేశానని తన తప్పులు తెలుసుకున్న అనంతరం అతను తనువు చాలించడం పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- అక్క కొడుకుని కాపాడే ప్రయత్నం.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు!
- Andhra: సర్.! ఆఫీస్‌పై ఏసీబీ రైడ్స్ అంట.. ఫోన్ కాల్ రాగానే దడుసుకున్నాడు.. కట్ చేస్తే
- గుంటూరు: హాస్టల్లో అమ్మాయి బ్యాగ్ చెక్ చేసిన సిబ్బంది.. కనిపించింది చూసి అవాక్కు
- మంగళవారం అప్పు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదంటారు? ఎందుకు?
- Astrology Tips: లక్ష్మీదేవి సంకేతం! బంగారం దొరికితే ఏమవుతుందో తెలుసా?





