చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వారి ఆగడాలు శృతిమించి పోతున్నాయి. మొన్నటి వరకు బైక్ పై వచ్చి రోడ్డు పై వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు ఎతుకెళ్లే వారు. ఇప్పుడు రూట్ మార్చారు డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లి మహిళల మెడలో నుండి బంగారం ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలు చైన్ స్నాచింగ్ చోరీ ఉదంతం కలకలం రేపుతుంది. జోగిపేట పట్టణంలోని సత్యసాయి కాలనిలో వృద్ధురాలు మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెల తాడును లాక్కెళ్లారు దుండగులు. ఇంట్లో ఉన్న శంకరంపేట మణెమ్మ అనే వృద్ధురాలి కంళ్లలో కారం కొట్టి దొంగలించారు.గమనించిన కూతురు వెంకట లక్ష్మీ అడ్డుకునే ప్రయత్నం చేసిన దుండగుడు తోసేసి బైక్ పై పరార్ అయ్యారు. వృద్ధురాలు శంకరమ్మ కూతురు దగ్గర గత కొన్ని రోజులుగా ఉంటుంది. కూతురు వెంకటలక్ష్మి దుండగులన్నీ వెంబడించిన ఫలితం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేసింది.స్థానికుల పిర్యాదుతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఎస్సై పాండు వెతికిన దుండగుల జాడ తెలిసిరాలేదు. బాధితురాలి నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు
Also Read
- Vijayawada: విజయవాడలో నడి రోడ్డుపై మహిళ దారుణ హత్య
- పట్ట పగలే దారుణం.. కళ్లల్లో కారం కొట్టి…
- లక్కీ డ్రా.. కేవలం రూ.250లకే ఇల్లు సొంతం చేసుకోవంటూ ప్రచారం..! పోలీసుల ఎంట్రీతో..
- అక్కాతమ్ముళ్లు అయి ఉండి ఇదేం పని.. ఆ ఆరుగురితో కలిసి..
- అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?





