SGSTV NEWS online
CrimeTelangana

అక్కాతమ్ముళ్లు అయి ఉండి ఇదేం పని.. ఆ ఆరుగురితో కలిసి..



హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మెహిదీపట్నం పోలీసులు తాండూర్‌కు చెందిన అక్కతమ్ముళ్లు రమేష్, రామేశ్వరి సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను నియమించుకుని.. దొంగ నోట్ల చెలామణి జరిపినట్లు విచారణలో తేలింది.

హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ కరెన్సీ ముఠా పోలీసులకు పట్టుబడింది. మెహిదీపట్నం పోలీసులు దర్యాప్తు చేసి మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారులు రమేష్,  రామేశ్వరి అనే అక్కతమ్ముళ్లగా గుర్తించారు. వీరు తాండూర్ నివాసితులు. వీరు ఇంతకు ముందు కూడా ఫేక్ కరెన్సీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

రమేష్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకొని నకిలీ నోట్ల వ్యాపారం విస్తరించాడు. తక్కువ ధరకే ఫేక్ కరెన్సీ అందిస్తాం అంటూ ఓ రేంజ్‌లొ నెట్టింట ప్రకటనలు పెట్టి కస్టమర్లను ఆకర్షించాడు. వాటిని చూసి పలువురు వ్యక్తులు 1:4 రేషియోలో, అంటే 100 నార్మల్ కరెన్సీ ఇస్తే.. 400 నకిలీ కరెన్సీ పొందేలా ఒప్పందం చేసుకుని డబ్బులు పంపించారు.

అయితే ఫేక్ నోట్ల‌ను రమేష్ తయారీ చేసే విధానం మరింత షాకింగ్‌గా ఉంది. ఒరిజినల్ నోటును కలర్ జిరాక్స్ తీసి, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసి, గ్రీన్ కలర్ గిఫ్ట్ పేపర్‌పై సరైన సైజులో ప్రింట్ తీసేవాడు. ఆ తర్వాత వాటిని ఫెవికాల్‌తో అతికించి ఒరిజినల్ నోట్ల మాదిరిగా కనిపించేలా తయారు చేసేవాడు. ఈ విధంగా తయారైన నకిలీ నోట్లను ముఠా సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో చలామణి చేశారు.

దీని సమాచారం అందుకున్న మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించి రమేష్ సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4.75 లక్షల విలువైన నకిలీ కరెన్సీ, 9 సెల్‌ఫోన్లు, పలు ప్రింటింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. రమేష్ ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. పోలీసులు ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read

Related posts