ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన గుంటూరు వాసులు… ఒక్కొక్కరు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ చెల్లించారు.
ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన గుంటూరు వాసులు… ఒక్కొక్కరు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ చెల్లించారు. డబ్బులు చెల్లించి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదు. డబ్బులివ్వాలని అడిగితే నావద్ద లేవంటూ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మంగళగిరికి చెందిన సుధా రెడ్డి చేసిన మోసంపై బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనకి టిటిడిలో తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పుకున్న సుధారెడ్డి కల్యాణ కట్టలో తలనీలాలు తొలగించే ఉద్యోగాలున్నాయని డబ్బులిస్తే ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పింది. దీంతో చాలా మంది నాయిూ బ్రాహ్మణులు ఆమె మాటలు నమ్మారు.
గుంటూరు నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 2022 డిసెంబర్ లో ఆమె కార్యాలయానికి వెళ్లి లక్ష నుండి లక్షన్నర వరకూ ఒక్కొక్కరు కట్టారు. 2023 జనవరిలోనే ఉద్యోగాలు వస్తాయంటూ చెప్పింది. ఆ తర్వాత జూన్ వరకూ వెయిట్ చేయాలంది.. అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకొకసారి ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చింది. 2024 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వంలోకి రాలేదని దీంతో ఉద్యోగాలు రావంటూ తేల్చి చెప్పింది. అప్పటి నుండి డబ్బులివ్వమని అడుగుతుంటే ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చింది. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయలు కట్టిన వారికి యాబై వేలు ఇస్తానంటూ చెబుతూ వచ్చింది. దీంతో స్థానికులు ఆమె కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
దాదాపు 200 మంది బాధితులున్నారు. వీరంతా ఆమె కార్యాలయానికి రావడంతో పోలీసులకు వరకూ ఈ విషయం చేరింది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ప్రభుత్వం స్పందించి తమకు డబ్బులిప్పించాలని కోరుతున్నారు
Also read
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి





