శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని ఐఐఐటిలో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈరోజు ఉదయం హాస్టల్ రూంలో సృజన్ అనే విద్యార్ధి ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ట్రిబుల్ ఐటీ లో మూడో సంవత్సరం EEE చదువుతున్న గుంటూరు కి చెందిన సృజన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎచ్చెర్ల పోలీసులు..
శ్రీకాకుళం, నవంబర్ 12: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని ఐఐఐటిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రత్తిపాటి సృజన్ (20) అనే విద్యార్ది ఈఈఈ ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ బుధవారం (నవంబర్ 12) ఉదయం హాస్టల్ రూంలో సృజన్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. గమనించిన తోటి విద్యార్ధులకు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు హాస్టల్ గది తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అయితే అప్పటికే సృజన్ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి సృజన్‌ను గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు.
ట్రిపుల్ ఐటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం సృజన్ మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సృజన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు
Also Read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





