SGSTV NEWS online
Andhra PradeshCrime

విద్యార్థి తో  అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్  నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు


Tirupathi District: చి సమాజం ఏమవుతుందో అర్థం కావడం లేదు.. మహిళలలు బయట తిరిగితే చాలు వేటకు దిగుతారు.. ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఆకరికి జ్ఞానం నేర్పించాల్సిన గురువు కూడా అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

దుర్మార్గులు చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా అమ్మాయిలను వేధిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సమాజాన్ని కాపాడాల్సిన గురువు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరికి పాపం పండింది.. చిక్ష పడింది.

మైనర్ బాలకపై అత్యాచారం.. టీచర్ అరెస్ట్..

అయితే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బాలికను మాయమాటలతో లోబరుచుకొని మూడు సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ చెన్నంపల్లి జలపతి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

కూతురు ప్రవర్తనను గమనించి నిలదీయగా వెలుగులోకి సంచలన విషయాలు కొద్ది రోజుల నుంచి కూతురు ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఏమైందని నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం గారి పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టుకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

బాలల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ విజ్ఞప్తి

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ప్రజలకు సందేశం ఇస్తూ. బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలి. బాలల భద్రత అందరి బాధ్యత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు

Also Read

Related posts