రాజవొమ్మంగి (అల్లూరి) : కట్టుబట్టలతో గిరిజన మహిళ వీధినపడింది. మండలంలోని చెరుకుంపాలెం పంచాయతీ, మిరియాలవీధి గ్రామానికి చెందిన కుంజం సత్యవతి అనే గిరిజన మహిళ సత్యవతి. ఆమె భర్త పెద్దకాపు (58) అనారోగ్యంతో మంగళవారం మరణించారు. భర్త దహన సంస్కారాలను నిర్వహించి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలోనే ఆ మరణ బాధ నుండి కోలుకోక ముందే అదే రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదంలో తాటాకు ఇళ్లు దగ్థమైంది. ఇంట్లో వస్తువులు, డబ్బులు, బంగారం సర్వస్వం కాలిపోయి బూడిదవ్వడంతో గిరిజన మహిళ కట్టుబట్టలతో వీధిన పడింది. సత్యవతి ఇద్దరు పిల్లలు వివాహాలు చేసుకొని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. 11 తేదీ మంగళవారం భర్త పెదకాపు మరణించడంతో బాధలో ఉండగా తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతి అవడంతో ఆ కుటుంబానికి తీవ్ర బాధ ఏర్పడిందని గ్రామ సర్పంచ్ దాసరి నాగేశ్వరరావు వివరించారు. ఒకే రోజు రెండు దుర్ఘటనలతో జీర్ణించుకోలేకపోతున్నానని గిరిజన మహిళ సత్యవతి రోదిస్తున్న తీరు చూపరులను కలిసి వేసింది. బాధిత కుటుంబాన్ని జడ్డంగి పీహెచ్సీ వైద్యాధికారి పావని, పరామర్శించి ధైర్యంగా ఉండాలన్నారు. గ్రామ సర్పంచ్ దాసరి నాగు సత్యవతి కి ప్రభుత్వం తరఫున 25 కేజీల బియ్యం, పంచదార, నూనె, నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. సత్యవతికి పంచాయతీ తరపున సహకారం అందిస్తామని సర్పంచ్ నాగు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జి మాణిక్యం, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విఆర్వో, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Also Read
- Andhra: ‘అమ్మ.. కన్నయ్య’.. కంటతడి పెట్టిస్తోన్న ఆ చిత్రం.. పాపం ఆమె ఎంత కుమిలిపోయిందో..
- Hyderabad: 45 ఏళ్ల పాత సమాధిలో మరో మృతదేహాన్ని పాతిపెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంట్లోకి వెళ్లిన ఓ యువకుడు.. ఆ తర్వాత, ఏం జరిగిందంటే..
- శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీలో విద్యార్ధి సూసైడ్.. ఏం జరిగిందో?
- విద్యార్థి తో అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్ నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు





