హైదరాబాద్‌లో ఒక విద్యార్థికి నాంపల్లి కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా మోసం చేసి, ఆమె వ్యక్తిగత ఫోటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసిన విద్యార్థి ఆశం ఆకాష్‌కు నాంపల్లి కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది.
లాలగూడా ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను ఆకాష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకం సంపాదించి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, వ్యక్తిగత ఫోటోలు పొందాడు. కొంతకాలం తర్వాత ఆ ఫోటోలను చూపిస్తూ బాలికను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆకాష్ తన వద్ద ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి, డబ్బు అడిగినట్లు పోలీసులకు సదరు బాలిక తెలిపింది. ఆ బెదిరింపులకు భయపడిన మైనర్ బాలిక కొంతకాలం మౌనంగా భరించింది. తరువాత డబ్బు అవసరమవడంతో సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధితురాలి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు విచారించగా, ఈ షాకింగ్ విషయమంతా బయటపడింది.
తనపై జరుగుతున్న వేధింపులు ఇక భరించలేనని, ఆకాష్ తన గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని మైనర్ బాలిక లాలగూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకాష్ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు సీజ్ చేసి పరిశీలించగా, అనేక వ్యక్తిగత ఫోటోలు, చాట్ రికార్డులు బయటపడ్డాయి. ఈ కేసులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణ జరగగా, పోలీసులు సమర్పించిన ఆధారాలు నిందితుడి దోషి అని నిర్ధారించాయి. చివరికి న్యాయమూర్తి ఆశం ఆకాష్ దోషిగా తేల్చి, అతనికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.
Also read
- Andhra: ‘అమ్మ.. కన్నయ్య’.. కంటతడి పెట్టిస్తోన్న ఆ చిత్రం.. పాపం ఆమె ఎంత కుమిలిపోయిందో..
- Hyderabad: 45 ఏళ్ల పాత సమాధిలో మరో మృతదేహాన్ని పాతిపెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంట్లోకి వెళ్లిన ఓ యువకుడు.. ఆ తర్వాత, ఏం జరిగిందంటే..
- శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీలో విద్యార్ధి సూసైడ్.. ఏం జరిగిందో?
- విద్యార్థి తో అక్రమ సంబంధం.. ‘అంకుశం’ స్టైల్ నడి రోడ్డుపై నడిపించిన తిరుపతి పోలీసులు





