SGSTV NEWS online
CrimeTelangana

క్రికెట్ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి.. ఓయో హోటల్‌లో యువకుడి సూసైడ్!



బెట్టింగ్ జోలికి వెళ్లవద్దని ఎంత మంది ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది మాత్రము అసలు లెక్క చేయడం లేదు. బెట్టింగ్ లు పెట్టడం కోసం వారి వద్ద ఉన్న డబ్బులతో మాత్రమే కాకుండా.. అప్పులు చేసి మరీ బెట్టింగ్ లు పెడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాగే..

రామచంద్రాపురం, నవంబర్‌ 11: బెట్టింగ్ జోలికి వెళ్లవద్దని ఎంత మంది ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది మాత్రము అసలు లెక్క చేయడం లేదు. బెట్టింగ్ లు పెట్టడం కోసం వారి వద్ద ఉన్న డబ్బులతో మాత్రమే కాకుండా.. అప్పులు చేసి మరీ బెట్టింగ్ లు పెడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాగే క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ పక్కన ఉన్న లావీ షోక్ ఓయో రూంలో అఖిల్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. 30 ఏళ్ల అఖిల్ ఈ‌ నెల 10వ తేదిన ఓయో రూం తీసుకున్నా. ఆ రోజు తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచరం ఇచ్చాడు అఖిల్. తాను క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టి మోసపోయనని, బెట్టింగ్ ల కోసం పలువురి వద్ద అప్పులు చేశానని తండ్రితో చెప్పుకుని బాధపడ్డడు.

ఆ తర్వాత ఓయో రూంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్‌ తండ్రి సంగీత్ రావు రామచంద్రాపురం సాయి‌నగర్ లో నివాసం ఉంటున్నరు. చేతికి వచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మరో వైపు రామచంద్రాపురం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకు‌ని దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts