SGSTV NEWS online
Andhra PradeshCrime

నా తల్లి, తమ్ముడు దెయ్యాలు.. అందుకే చంపేస్తా



కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి. ప్రశాంతంగా ఉండే ఆ ఊరులో ఒక్కసారిగా భయం కమ్ముకుంది. మరి ఇంతకీ అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.


పశ్చిమగోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారు పేరు. అందులో భీమవరం ఆతిధ్యానికి అగ్రపీఠం వేస్తుంది. అటువంటి భీమవరంలో ఒక వ్యక్తి జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరంలోని సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న గునుపూడి మహాలక్ష్మి(60), గుడి రవితేజ(33)లు నిద్రిస్తుండగా గునుపూడి శ్రీనివాస్ విచక్షణ రహితంగా వారిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. తల్లి గునుపూడి మహాలక్ష్మి, తమ్ముడు గునుపూడి రవితేజ మృతి చెందారని నిర్ధారించుకున్న గునుపూడి శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.

భీమవరం సుంకరపద్దయ్య గారి వీధిలో మన్నా చర్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గునుపూడి శ్రీనివాస్‌కి ఇంకా వివాహం కూడా కాలేదని, ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ తండ్రి కరోనా సమయంలో మృతి చెందాడు. ఆ తరువాత నుండి శ్రీనివాస్ ఇంట్లోనే ఉంటున్నాడు. బయటకు వెళితే ఇతరులతో శ్రీనివాస్ గొడవ పడేవాడు. శ్రీనివాస్‌ను ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దని తమ్ముడు రవితేజ హెచ్చరించాడు. ఇంటిలో అవసరాలు , ఖర్చులు, ఆదాయం అంతా రవితేజ చూసుకుంటాడు. ఇంటిలో తనకు గుర్తింపు లేదని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఆదివారం రాత్రి తమ్ముడు రవితేజతో నిందితుడు శ్రీనివాస్ గొడవ పడ్డాడు. ఈ విషయంలో తల్లి శ్రీనివాస్‌ను హెచ్చరించింది.

దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన శ్రీనివాస్ అర్ధరాత్రి రెండు, మూడు గంటల సమయంలో తల్లి, తమ్ముడుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్యకు గురైన రవితేజ భీమవరంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. సంఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరిశీలించారు. కీలక ఆధారాలను సేకరించారు. తల్లి , తమ్ముడు మనుషులు కాదు … దెయ్యాలు అందుకే చంపేశానని నిందితుడు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కుటుంబ సమస్యల కారణంగా హత్య చేశాడా, అర్దిక వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు

Also Read

Related posts