SGSTV NEWS online
CrimeTelangana

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. శవాలపై చిల్లరేరుకోవడం అంటే ఇదేనేమో.. గుండె నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లగా..

నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైందని అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాకయ్యారు.

ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైన ఈ ఘటన నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో ఉన్న వృద్దురాలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆదివారం తెల్లవారుజామున నగరంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే గత రెండ్రోజులు అక్కడే చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది.

ఈ విషయాన్ని హాస్పిటల్‌కు సిబ్బంది వారి కుటుంబ సభ్యులక తెలియజేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వచ్చిన చూడగా ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు కనిపించలేదు. దీంతో గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలు చనిపోయినప్పుడు ఒంటిపై బంగారు గొలుసు ఉందని, తాము బయటకు వెళ్లి వచ్చేలోపు అది మాయం అయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి విడిగా ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ పుటేజ్ నిక్షిప్తం అయే డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also Read

Related posts