శ్రీ సత్య సాయి జిల్లాలో మంత్రి సవితకు ఓ ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వచ్చింది. పెనుకొండ–అనంతపురం మార్గంలో ఆమె కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వకుండా అడ్డంగా ఆటో నడిపిన డ్రైవర్‌ను మంత్రి నిలదీశారు. అతడిని ఆపి వివరాలు ఎంక్వైరీ చేయగా అసలు విషయం తేలింది.
మంత్రి ప్రయాణిస్తున్న కారుకు ఆ ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. పోలీస్ ఎస్కార్ట్ వాహనం సైరన్ వేసినా ఆ ఆటో డ్రైవర్ చెవిన పడ లేదు. ఇంకేముంది మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చింది. రోడ్డుపై అడ్డదిడ్డంగా తిరుగుతున్న ఆటోను ఆపి.. కారులో నుంచి దిగిన మంత్రి ఆటో డ్రైవర్‌ను చెడామడా తిట్టేశారు. ఆ తర్వాత చూస్తే.. వాడు ఫుల్లుగా మద్యం తాగినట్లు అర్థమైంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్య సాయి జిల్లాలో మంత్రి సవితకు ఓ ఆటో డ్రైవర్ పై కోపం వచ్చింది. పెనుకొండ నుంచి అనంతపురం వస్తున్న మంత్రి సవిత కాన్వాయ్‌కు ఆటో డ్రైవర్ అడ్డు తగిలాడు. సైరన్ కొట్టానా ఆటో డ్రైవర్ బాలన్న మంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేదు. ఆఖరికి పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా కూడా … రోడ్డుపై అటు ఇటు అడ్డంగా ఆటో తిప్పుతూ కంగారు పెట్టాడు… ఏకంగా మంత్రి ప్రయాణిస్తున్న కారునే ఢీకొట్టబోయాడు ఆటో డ్రైవర్. కాసేపటికి ఆటోను ఓవర్ టేక్ చేసిన మంత్రి సవిత.. కారులోంచి దిగిన ఆటో డ్రైవర్ బాలన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… ఫుల్లుగా మందు తాగి ఉన్న ఆటో డ్రైవర్ బాలన్న పరిస్థితి చూసి… మంత్రి సవితకు మరింత కోపం వచ్చింది.
ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని… సోయిలో లేకుండా మద్యం తాగి ఆటో నడుపుతున్న బాలన్నపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు… మద్యం తాగి ఆటో నడిపి… ప్రమాదానికి గురైతే… ఎవరిది బాధ్యత అంటూ అతని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రోడ్డుపైనే క్లాస్ పీకారు. వెంటనే పోలీసులను పిలిచి…. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని మంత్రి సవిత ఆదేశించారు. వీడెవడండీ బాబు.. రోడ్డుపై వెళ్తున్న మంత్రికే చుక్కలు చూపించాడు ఆటో డ్రైవర్ అనుకుంటున్నారు రోడ్డుపైన వెళ్లే వాహనదారులు.
Also Read
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి





