బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమెరికాలోని టెక్సాస్‌లో చదువుకున్న 23 ఏళ్ల రాజ్యలక్ష్మి యర్లగడ్డ రాజ్యలక్ష్మి అలియాస్ రాజి నవంబర్ 7, 2025 ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. పై చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయందనే విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అమెరికాలోని టెక్సాస్‌లో చదువుకున్న 23 ఏళ్ల రాజ్యలక్ష్మి యర్లగడ్డ రాజ్యలక్ష్మి అలియాస్ రాజి నవంబర్ 7, 2025 ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. టెక్సాస్ A&M యూనివర్సిటీ , కార్పస్ క్రిస్టీ నుండి ఇటీవలే రాజ్యలక్ష్మి పట్టా పొందింది. తన కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉండాలని కలలుకన్న ఆమె జీవితం, ఆ కల నెరవేరక ముందే అనారోగ్యంతో అర్ధాంతరంగా తనువు చాలించింది. బాపట్లజిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అమెరికాలో ఇటీవలే ఉన్నత చదువులను పూర్తి చేసుకుంది. రాజి రెండు మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతూ ఉంది.
నవంబర్ 7 ఉదయం అలారం మోగినా లేవలేదు. దీంతో తోటి స్నేహితులు గమనించి చికిత్స అందించే లోపే ఆమ మృత్యువాత పడినట్టు తెలిసింది. దీంతో ఆమె కుటుంబం, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు. రాజి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం ఆధారంగా జీవిస్తోంది. వారికున్న భూమి, పశువులు వారిని నిలబెట్టే ఆర్థిక ఆధారం . రాజి మాత్రం చదువుతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో అమెరికాకు వెళ్లింది.
అయితే ఆ ఆశలు నెరవేరకముందే ఆమె తనువు చాలించింది. దీంతో కారంచేడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజి మృతదేహాన్ని స్వగ్రామం కారంచేడుకు తరలించేందుకు భారత ఎంబసి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆమె మృతదేహం ఇండియాకు చేరుకోనుంది.
Also Read
- Vijayawada: విజయవాడలో నడి రోడ్డుపై మహిళ దారుణ హత్య
- పట్ట పగలే దారుణం.. కళ్లల్లో కారం కొట్టి…
- లక్కీ డ్రా.. కేవలం రూ.250లకే ఇల్లు సొంతం చేసుకోవంటూ ప్రచారం..! పోలీసుల ఎంట్రీతో..
- అక్కాతమ్ముళ్లు అయి ఉండి ఇదేం పని.. ఆ ఆరుగురితో కలిసి..
- అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?





